భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు!.. సామాన్యుడిపై భారం

49చూసినవారు
భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు!.. సామాన్యుడిపై భారం
నిత్యావసరాలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. రోజువారీ వినియోగించే సరకుల ధరలు 20-30 శాతం మేర పెరిగాయి. క్వాలిటీ రైస్ గతంలో కిలో రూ.45-50 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.70 పైగా ఉంది. ఉల్లి కిలో రూ.20-60కి చేరింది. అల్లం, వెల్లుల్లి ధరలు కిలో రూ.150 కంటే అధికంగానే ఉన్నాయి. గతంలో లీటర్​ సన్​ఫ్లవర్ ఆయిల్ రూ.160లోపే ఉండగా ప్రస్తుతం వాటి ధర రూ.180కి పైనే ఉంది. పంచదార కిలో సగటున రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.60-70గా ఉంది. కంది, మినప, పెసరపప్పులు గతంతో పోలిస్తే కిలోకు రూ.20పైగా పెరిగాయి.

సంబంధిత పోస్ట్