ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద భారీగా గంజాయిని అధికారులు పట్టుకున్నారు. లగేజ్ ఎక్స్-రే స్క్రీనింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు లగేజ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కిచెన్ పాత్రల అడుగు భాగాల్లో దాచిపెట్టిన 874 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు తెలివిగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.