TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఏడో రోజైన నేడు, గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదుల సంగమ క్షేత్రంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, నదీమతల్లికి నీరాజనాలు అర్పిస్తున్నారు. జూన్ 1తో పుష్కరాలు ముగియనున్నాయి.