ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబానికి హైదరాబాద్ నగరంలో ఒక ఫామ్ హౌస్ ఉంది. శనివారం ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి ఆ ఫామ్ హౌస్‌లో పార్టీ జరగనుంది. అయితే నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ వచ్చిన సందర్భంగా చంద్రబాబు సతీమణి, బాలకృష్ణ సోదరి భువనేశ్వరి ఒక పార్టీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పార్టీకి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది.