ఆగస్టు 6న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ: కవిత

20చూసినవారు
ఆగస్టు 6న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ: కవిత
TG: హైదరాబాద్‌లో ఆగస్టు 6న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ టీఆర్ఎస్ బీసీ నేతలతో ఆమె సమావేశయ్యారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధనకు 'సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ' పేరుతో సభ నిర్వహిస్తామని తెలిపారు. బీసీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారిని ఒక్కతాటిపైకి తెస్తామన్నారు. ఆగస్టు 6న సభ దేశ గతినే మార్చేస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్