తిరుమల రెండో ఘాట్ రోడ్డులో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులకు సుమారు 10 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ కనిపించడంతో భయాందోళనలు నెలకొన్నాయి. రోడ్డు దాటుతున్న పామును చూసి భక్తులు వాహనాలు ఆపడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం పాము అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు కొండ ప్రాంతాల్లో ఇలాంటివి సహజమని, భక్తులు రాత్రిపూట నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.