హెచ్-1బీ ఫీజు అంశంలో అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అమెరికా బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లు చెల్లించాలని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ (యూఎస్ సీఐఎస్) స్పష్టం చేసింది. H1B ఫీజు పెంచే సమయానికి అమెరికాలో ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించారు. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, పని చేస్తున్న విద్యార్థులకు భారీ ఊరట దక్కింది.