ముంబైలో ఒక బ్లింక్ఇట్ డెలివరీ ఏజెంట్ తన బ్యాగ్ లోంచి అనుకోకుండా పామును కింద పడేయడంతో స్థానికులు షాక్ అయ్యారు. ఆ ఏజెంట్ పామును తిరిగి బ్యాగ్ లో వేసుకుని వెళ్ళిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై "ఇప్పుడు పాములని కూడా డెలివరీ చేస్తున్నారా?" అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.