కోల్‌కతా వెళ్తున్న కటిహార్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లో ప్రయాణికులకు వెన్నులో వణుకు పుట్టించే సీన్ ఎదురైంది. రాత్రి సమయంలో రైలు వెళ్తుండగా సైడ్ లోయర్ బెర్త్ కింద నుంచి ఉన్నట్టుండి ఒక భారీ పాము బయటకు పాకుతూ కనిపించింది. అది చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులు ఫోన్ లైట్లతో తీసిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతుండగా, రైల్వే భద్రత, పరిశుభ్రతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.