
కిందపడ్డ స్టూడెంట్ టోపీ.. స్వయంగా తీసిన మోదీ (వీడియో)
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఢిల్లీ ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా, తన పాదాలకు నమస్కరించడానికి వచ్చిన ఒక విద్యార్థి టోపీ కిందపడగా, ప్రధాని మోదీ స్వయంగా వంగి దాన్ని తీసి ఆ విద్యార్థి తలపై సరిగా పెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




