ఆస్ట్రేలియాలో జరిగిన ఒక దేశీయ వన్డే మ్యాచ్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం దక్షిణ
ఆస్ట్రేలియా, టాస్మేనియా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్మేనియా స్పిన్నర్ రాఫ్ మెక్‌మిలన్ వేసిన ఒక భారీ వైడ్ బంతిని, దక్షిణ
ఆస్ట్రేలియా బ్యాటర్ జాక్ వెదరాల్డ్ క్రీజ్ దాటి వచ్చి సిక్సర్‌గా మలిచాడు. అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇవ్వడంతో, వెదరాల్డ్ మరింత రెచ్చిపోయి మరో భారీ సిక్సర్ బాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.