భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన (వీడియో)

11చూసినవారు
భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపై మనుషులు నివసించేందుకు ఉపయోగపడే ‘భారతీయ హ్యాబిటబుల్ ఎక్స్‌పాండబుల్ ఎక్స్‌ట్రాటెర్రెస్ట్రియల్ హ్యాబిటాట్’ (BHEEM) భావనను గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా ప్రతిపాదించారు. రష్యా శిక్షణ అనంతరం బెంగళూరులోని ఐఐఎస్సీలో చేపట్టిన పరిశోధనలో భాగంగా ఈ కాన్సెప్ట్‌ అభివృద్ధి చేశారు. రేడియేషన్‌, తీవ్ర ఉష్ణోగ్రతలు వంటి సవాళ్ల నుంచి వ్యోమగాములను రక్షించే నివాస వ్యవస్థపై ఇందులో దృష్టి పెట్టారు. 20 ఏళ్ల తర్వాత భూమికి ఆవల మనుషులు నివసించాలంటే పరిశోధనలు ఇప్పటి నుంచే ప్రారంభించాలని శుక్లా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్