గాజాలో మానవతా సహాయం.. పుట్టిన బిడ్డకు “సింగపూర్‌” అని పేరు

14644చూసినవారు
గాజాలో ఓ జంట తమ పాపకు “సింగపూర్‌” అని పేరు పెట్టింది. యుద్ధ సమయంలో సహాయం అందించిన లవ్‌ ఎయిడ్‌ సింగపూర్‌ అనే సేవాసంస్థకు గుర్తుగా ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. అక్టోబర్‌ 16న పాప జన్మించింది. పాప తండ్రి హమ్దాన్‌ హదాద్‌ ఆ సంస్థ సూప్‌ కిచెన్‌లో వంట మనిషిగా పనిచేసేవాడు. వార్ టైంలో గర్భిణీ భార్యకు ఆ భోజనాలు జీవనాధారమయ్యాయని పేర్కొన్నాడు. 2.7 కిలోల బరువుతో పాప పుట్టిందని, ఆమెకు శాంతి, ప్రకాశవంతమైన భవిష్యత్తు కలగాలని లవ్‌ ఎయిడ్‌ సింగపూర్‌ ఆకాంక్షిస్తూ పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్