దేవుడి ఊరేగింపులో హ్యూమనాయిడ్‌ రోబో సందడి (వీడియో)

29చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆగస్టు 31న జరిగిన బాబా మహాకాల్‌ ఊరేగింపులో ఓ హ్యూమనాయిడ్‌ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందౌర్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థ రూపొందించిన ఈ రోబో, మనిషిని పోలిన రూపంతో ఊరేగింపులో పాల్గొని, షిప్రా నదిలో పడవపై ప్రయాణించి భక్తులను ఆశ్చర్యపరిచింది. భక్తుల అభివాదానికి స్పందిస్తూ, సంగీతానికి అనుగుణంగా నృత్యం చేసిన రోబో, రామ్‌ఘాట్‌ వద్ద ఆధ్యాత్మిక అలంకరణతో సంస్కృత మంత్రాన్ని పఠించి భక్తులను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.

సంబంధిత పోస్ట్