పొలాల్లో వందల నాటు కోళ్లు.. ఎగబడిన జనం(వీడియో)

1చూసినవారు
TG: పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు వందల కొద్ది నాటు కోళ్లని వదలడంతో జనం ఎగబడ్డారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలో చోటు చేసుకుంది. ఎల్కతుర్తి-సిద్దిపేట NH 765 పంట చేనుల్లో వందలాది నాటు, బ్రాయిలర్ కోళ్లను వదిలి వెళ్లారు. ఈ విషయం తెలియడంతో గ్రామస్థులు ఆ కోళ్ల కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. కొందరు పదుల సంఖ్యలో కోళ్లను సంచుల్లో వేసుకుని వెళ్లారు. అసలు ఈ కోళ్లను ఎవరు, ఎందుకు వదిలి వెళ్లారనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్