ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, 2025 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని గురువారం ప్రకటించారు. హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై ఈ ఏడాది సాహిత్య నోబెల్ అవార్డు పొందారు. ఈయన డిస్టోపియన్ నవలలు అనేక అవార్డులు గెలుచుకున్నాయి. వీటిలో 2019లో అనువాద సాహిత్యంలో నేషనల్ బుక్ అవార్డు, 2015లో మాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గెలుచుకున్నవి ఉన్నాయి.