కర్ణాటక బెళగావి జిల్లా కమల్దిన్ని గ్రామంలో 4 నెలల వివాహిత సాక్షి(22) హత్యకు గురైంది. బుధవారం ఇంట్లో దుర్వాసన రావడంతో ఆమె మృతదేహాన్ని పరుపు కింద గుర్తించిన భర్త తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. భర్త ఆకాశ్ పరారీలో ఉండగా, అదనపు కట్నం కోసం వేధించాడని సాక్షి కుటుంబం ఆరోపించింది. పోలీసులు హత్యపై కేసు నమోదు చేశారు. 3 రోజుల క్రితం హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఆకాశ్ కోసం గాలింపు చేస్తున్నారు.