బైక్‌పై వాగు దాటుతూ.. భార్యాభర్తలు గల్లంతు!

9చూసినవారు
బైక్‌పై వాగు దాటుతూ.. భార్యాభర్తలు గల్లంతు!
TG: సిద్దిపేట జిల్లాలో 'మొంథా' తుపాను బీభత్సం సృష్టించింది. అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ఉద్ధృతికి ప్రణయ్, కల్పన దంపతులు గల్లంతయ్యారు. భీమదేవరపల్లి మండలం నుంచి అక్కన్నపేటకు వెళ్తుండగా, మల్లారం వద్ద రోడ్డు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లారు. మార్గమధ్యంలో మోత్కులపల్లి వద్ద వాగులో కొట్టుకుపోయారు. స్థానికులు గుర్తించిన ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా వారి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్