భద్రాచలంలో LIC ఏజెంట్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు సినీ ఫక్కీలో భారీ మోసానికి పాల్పడ్డారు. నిరుపేదలను ఆసరాగా చేసుకుని LIC పాలసీలు కట్టించి, బతికుండగానే 39 మందికి నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించి, ఏకంగా రూ. 1.52 కోట్లను కాజేశారు. గ్రీన్ ఇంకుతో గెజిటెడ్ సంతకాలు పెట్టి, నకిలీ పత్రాలతో క్లెయిమ్‌లు పొందిన ఈ ఘరానా మోసం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. LIC యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఈ అక్రమాలు బయటపడ్డాయి.