భార్య, ఆమె ప్రియుడిపై కత్తితో దాడి చేసిన భర్త

47చూసినవారు
భార్య, ఆమె ప్రియుడిపై కత్తితో దాడి చేసిన భర్త
AP: తిరుపతి జిల్లా, పుత్తూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కర్నూలుకు చెందిన భర్త (40) తన భార్య (35).. ఆమె ప్రియుడిపై కత్తితో దాడి చేశాడు. పిళ్లారిపట్టు రోడ్డులో నివసిస్తున్న ఈ దంపతుల మధ్య వివాహేతర సంబంధం కారణంగా తరచూ గొడవలు జరుగుతుండగా, భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె తన ప్రియుడితో ఇంట్లో ఉండగా, భర్త వారిపై చాకుతో దాడి చేసి గాయపరిచాడు. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్