ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో భర్త రాజేష్ లోధి (32) భార్య సీమ లోధిని (28) ఈనెల16న సుత్తితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం పరారైన రాజేష్ అక్టోబర్ 16న అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహ విభేదాలు, వరకట్న వేధింపుల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అత్తమామలు సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్నం కాకుండా మరేదైనా కారణం ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.