హర్యానాలోని జింద్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి OYO హోటల్‌కు వెళ్లింది. వారిద్దరినీ మహిళ భర్త రాకేష్ తన బంధువులతో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తనకు, తన భార్యకు మధ్య కుటుంబ వివాదాలు ఉన్నాయని, కోర్టులో కేసు కొనసాగుతోందని రాకేష్ వెల్లడించాడు. మూడేళ్ల కుమార్తెను, తనను పట్టించుకోకుండా తన భార్య ప్రియుడితో ఉంటోందని ఆరోపించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.