ఉత్తరప్రదేశ్లోని మీరట్లో, ఫైజ్ అనే వ్యక్తి తన భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై 80 అడుగుల
జియో మొబైల్ టవర్ను ఎక్కాడు. తన భార్యను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, కిందకు దిగడానికి నిరాకరించాడు. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, అతన్ని సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.