మధ్యప్రదేశ్‌లోని మురైలో ఓ భర్త తన భార్య ఫొటోను మరో వ్యక్తి ట్యాటూ వేసుకోవడం చూసి సూసైడ్ చేసుకున్నాడు. సంతోష్ శర్మ తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందని తెలుసుకుని భరించలేక విషం తాగాడు. ఇది గమనించిన భార్య, ఆమె ప్రేమికుడు భర్త ముఖేష్ అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భార్య, ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.