
బర్రె దూడపై అత్యాచారం.. కామాంధుడిని కొట్టిన యజమాని
TG: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. బీహార్‌కు చెందిన రోహిత్ అనే వ్యక్తి, సిద్దిరాములు అనే రైతుకు చెందిన పొలంలోని షెడ్డులో కట్టి ఉన్న ఏడాది వయస్సున్న బర్రె దూడపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనను సీసీటీవీ కెమెరాల్లో చూసిన షెడ్డు యజమాని సిద్దిరాములు, నిందితుడు రోహిత్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




