భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

73చూసినవారు
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని వడ్లగూడెంలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన గుంజా వెంకటేశ్వరరావు(40), అతని భార్య గంగాభవాని మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. దీంతో వీరిద్దరూ గత రెండేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్