ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లా నజీబాబాద్ రోడ్డులోని జైన్ ఫామ్‌లో ఒక వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. భార్యతో గొడవలు, కుటుంబ సమస్యల కారణంగా ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఎంఆర్‌గా పనిచేస్తున్న అమిత్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అమిత్ ఈ మధ్యనే తన సొంతింటిని అమ్మేశాడు. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.