భార్య పుట్టినరోజునే భర్త ఆత్మహత్య

0చూసినవారు
భార్య పుట్టినరోజునే భర్త ఆత్మహత్య
TG: భార్య పుట్టినరోజు నాడే ఓ ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన రమేష్‌ (40) భార్య రాధికతో కలిసి దేవినగర్‌లో నివాసముంటున్నాడు. సెప్టెంబర్‌ 1న రాధిక పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చారు. వారు బయటకు వెళ్లగా రమేష్‌ ఇంట్లోనే ఉండిపోయాడు. అర్ధరాత్రి భార్యకు ‘పొరపాటు జరిగింది.. సారీ.. గుడ్‌బై’ అంటూ మెసేజ్‌ పంపాడు. భార్య ఇంటికి వచ్చి చూడగా రమేష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్