ఒడిశాలోని బలాంగీర్ జిల్లాలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. శనివారం భార్య మొబైల్ ఫోన్‌తో తలపై బలంగా కొట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, డిశ్చార్జ్ అయిన కొద్దిసేపటికే ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.