సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య, అతను తన ప్రియురాలి ఇంటికి వెళ్లిన విషయాన్ని గమనించి రహస్యంగా తెలుసుకుంది. అక్కడ వారిద్దరూ ఏకాంతంగా ఉండగా అకస్మాత్తుగా దాడి చేసింది. తనను మోసం చేస్తున్న భర్తను, ప్రియురాలిని చూసి ఆగ్రహంతో ఆమె, ఇద్దరినీ దేహశుద్ధి చేసింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో @desHi__chora అనే 'ఎక్స్' ఖాతాలో షేర్ చేయబడింది.