భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

48చూసినవారు
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
కర్ణాటకలోని యాదగిరి జిల్లా సురపుర తాలూకా దొన్నెగేరాలో దారుణ ఘటన జరిగింది. భార్యను గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. సంగప్ప, మారెమ్మ (25) భార్యాభర్తలు. భర్త తనను సరిగ్గా చూసుకోవడంలేదని, తరచుగా గొడవలు జరగుతుండటంతో మారెమ్మ ఏడాది క్రితం భర్త ఇంటిని వదిలి తన స్వగ్రామానికి వచ్చింది. అయితే ఇటీవల భర్త సంగప్ప ఆమె ఉన్న ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ క్రమంలో భార్య రాత్రి నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో ఆమె మెడను నరికి హత్య చేశాడు. అనంతరం సురపుర పీఎస్ లో లొంగిపోయాడు.

సంబంధిత పోస్ట్