భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. భార్య ముక్కు కొరికేశాడు

18చూసినవారు
భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. భార్య ముక్కు కొరికేశాడు
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో దంపతుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివాహేత సంబంధం కారణంగా 27 ఏళ్ల మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి భర్త స్నేహితుడితో వెళ్లిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సెప్టెంబర్‌ 17న పిల్లలను తీసుకెళ్లేందుకు ఆమె పొరుగింటి పైకప్పు మీదుగా ఇంట్లోకి రావడంతో గొడవ జరిగింది. ఈ ఘటనలో భర్త దీపక్‌ తన ముక్కును కొరికాడని భార్య ఆరోపించింది. అయితే, ముందుగా భార్యే దాడి చేసి తన భర్తను గాయపరిచిందని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో పోలీసులు దీపక్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్