కర్ణాటకలోని ఖానాపుర్ ఎమ్మెల్యే విఠల్ హలగేకర్ భార్య రుక్మిణి, భర్త ఎమ్మెల్యే అయినప్పటికీ అంగన్‌వాడీ టీచర్‌గా తన విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు. 1992 నుంచి పనిచేస్తున్న ఆమె, పిల్లల సంరక్షణకే తన జీవితాన్ని అంకితం చేశారు. భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు కిడ్నీ దానం చేసి ప్రాణాలు కాపాడారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని ఆమె తెలిపారు.