ప్రియుడితో దొరికిన భార్య.. ఇద్దరి తలలు నరికిన భర్త (వీడియో)

80061చూసినవారు
తమిళనాడు కళ్లకురిచిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇంట్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తన భార్యతో పాటు ఆమె ప్రియుడినీ అతిదారుణంగా నరికి చంపాడు. వారి మొండాల నుంచి తలను వేరు చేశాడు. అనంతరం తలలు తీసుకెళ్లి వెల్లూరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో షా‌క్‌కు గురైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇంటి మేడపైకి వెళ్లి చూడగా అక్కడ పడి ఉన్న ఇద్దరి మొండాలు కనిపించాయి. దీంతో నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.