అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

1చూసినవారు
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
TG: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం ఓబులోనిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో గోపి (40) తన భార్య జములమ్మ (35)పై రోకలిబండతో దాడి చేసి హత్య చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన జములమ్మ మృతి చెందగా.. ఘటన అనంతరం గోపి పరారయ్యాడు. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు గోపి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్