TG: సూర్యాపేట జిల్లా మోతే మండలంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేశాడు ఓ భర్త. పోలీసుల వివరాల ప్రకారం.. విబలాపురం గ్రామానికి చెందిన షేక్ బందేల్లి, షేక్ కరింబి (45) భార్యాభర్తలు. గురువారం సాయంత్రం షేక్ బందేల్లి మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో బందేల్లి.. భార్యపై కర్రతో దాడి చేశాడు. తలపై తీవ్ర గాయాలు కావడంతో కరింబి కుప్పకూలింది. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.