పెళ్లైన 2 నెలలకే భర్త హత్య.. ఆన్‌లైన్‌ జూదమే కారణం!

46చూసినవారు
పెళ్లైన 2 నెలలకే భర్త హత్య.. ఆన్‌లైన్‌ జూదమే కారణం!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పెళ్లైన 2 నెలలకే భార్య తన భర్తను హత్య చేసింది. తొమ్మిదేళ్లు ప్రేమించుకున్న జితేంద్ర, జ్యోతి గత ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. జితేంద్ర ఆన్‌లైన్ జూదానికి బానిసయ్యాడు. భార్య ఖాతా నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. దీనిపై జరిగిన వివాదంలో జ్యోతి తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త గొంతు కోసి చంపేసింది. మృతదేహాన్ని కిటికీకి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోస్టుమార్టం నివేదికలో నిజం బయటపడటంతో పోలీసులు భార్యతో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్