ప్రియుడితో కలిసి భర్త హత్య.. పట్టించిన సీసా మూత (వీడియో)

26చూసినవారు
AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం చోటుచేసుకుంది. ఆంజనేయులు(32) భార్య సుబ్బులు కొంతకాలంగా గురు ప్రసాద్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడు గురు ప్రసాద్‌తో కలిసి భర్తను చంపాలని సుబ్బులు ప్లాన్ చేసింది. ఆంజనేయులుకు మద్యం తాగించి గురు ప్రసాద్, అతని షరీఫ్ బండరాయితో కొట్టి చంపి పారిపోయారు. పోలీసులకు మృతదేహం వద్ద సీసా మూత లభించగా.. అందులోని QR కోడ్ సాయంతో దాన్ని ఏ షాపులో కొన్నారో తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించి.. ప్రసాద్, షరీఫ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్