రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో భార్యను దారుణంగా హత్య చేసిన ఓ భర్తకు తాజాగా కోర్టు మరణశిక్ష విధించింది. అతడు చేసిన నేరం సమాజాన్ని కదిలించేదని సెషన్స్ జడ్జి రాహుల్ చౌదరి వ్యాఖ్యానించారు. నవానియా పీఎస్ పరిధిలోని వల్లభ్‌నగర్ నివాసి కిషన్ లాల్ తన భార్య లక్ష్మిని నల్లగా, లావుగా ఉన్నావంటూ తరచూ అవమానించి వేధించేవాడు. ఈ క్రమంలోనే 2017 జూన్ 24న ‘‘ఇది నిన్ను అందంగా మారుస్తుంది’’ అని చెప్పి ఆమెపై యాసిడ్ పోశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.