మరో మహిళతో భర్త ఎఫైర్.. వేట కొడవళ్లతో భార్య బంధువుల దాడి

0చూసినవారు
మరో మహిళతో భర్త ఎఫైర్.. వేట కొడవళ్లతో భార్య బంధువుల దాడి
TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో ఉద్రిక్తతకు దారి తీసింది. భర్త మల్లేష్ తన ప్రేయసితో తిరిగి వెళ్లిపోవడంతో భార్య శిరీష కుటుంబం ఆగ్రహానికి గురైంది. భూమి రిజిస్ట్రేషన్‌ ఒప్పందంపై వివాదం చెలరేగి ఘర్షణగా మారింది. దీంతో మల్లేష్ ఎక్కడ అంటూ శిరీష బంధువులు మల్లేష్ తండ్రి జంగమయ్య, తల్లి అలివేలు, తమ్ముడు పరమేశ్‌లపై వేటకొడవళ్లతో దాడి చేశారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్