
దగ్గు మందు తాగి ఏడుగు చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్ చింద్వాడా జిల్లాలో చిన్నారుల వరుస మరణాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. 15 రోజుల్లో ఏడుగురు పిల్లలు మూత్రపిండాలు విఫలమై మృతి చెందగా, వీరందరూ 5 ఏళ్ల లోపు వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. దగ్గు, జ్వరాల సమస్యతో వైద్యుల వద్దకు తీసుకెళ్లిన పిల్లలకు కోల్డ్ రిఫ్, నెక్ట్రో-DS సిరప్స్తో పాటు కొన్ని మందులు ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అవి వాడిన తర్వాత మూత్రం రాక ఇబ్బంది పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటనపై అధికారులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు.




