
కారుపై ట్యాంకర్ బోల్తా.. ఒకరు మృతి(వీడియో)
AP: ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్‌ప్లాజా వద్ద BMW కారుపై సిమెంట్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడు అడ్వకేట్ బొద్దులూరి శ్రీనివాస రావు(65)గా గుర్తించారు. ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఆయన పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. రెస్క్యూ టీం శ్రీనివాసరావు మృతదేహాన్ని కారులోనుంచి వెలికితీసింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.




