గుజరాత్‌లోని బనస్కాంతలో ఇటీవల జరిగిన ఓ షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ మిస్సింగ్ కేసులో మానవ అక్రమ రవాణా, అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో భర్తతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. తన భర్త తనను రూ.50,000కు స్నేహితులకు విక్రయించాడని, వారు తనపై లైంగిక దాడికి పాల్పడి, నగలు లాక్కున్నారని బాధితురాలు తెలిపారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి లోబర్చుకున్న కేసుల్లో భర్త నిందితుడిగా ఉన్నాడని సమాచారం.