భార్యను గొంతు కోసి చంపిన భర్త (వీడియో)

27చూసినవారు
UP, లక్నోలోని బజార్‌ఖాలా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త వేధింపుల కారణంగా కొత్తగా పెళ్లైన 26 ఏళ్ల మహిళ మూడు నెలలుగా తన పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె భర్త తనకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. ఆపై నిర్మానుష్యమైన వీధిలోకి తీసుకెళ్లి ఆమె గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పెళ్లైన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడంతో మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్