
ఏపీలో నేడు, రేపు వర్షాలు: వాతావరణ శాఖ
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి, మరో 2-3 రోజుల్లో బెంగాల్ మీదుగా తూర్పు భారతం వైపు వెళ్లనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వల్ల రుతుపవనాల్లో కదలిక రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రజలకు మాత్రం ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించట్లేదు. ఈ ప్రాంతాల్లో మరో ఆరేడు రోజుల పాటు తీవ్రమైన ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.




