చదివించి SIని చేసిన భర్త.. పిలక ఉందని విడాకులిస్తానుంటున్న భార్య

67చూసినవారు
చదివించి SIని చేసిన భర్త.. పిలక ఉందని విడాకులిస్తానుంటున్న భార్య
భోపాల్ ఫ్యామిలీ కోర్టులో ఓ విచిత్రమైన విడాకుల కేసు నమోదైంది. పౌరోహిత్యం చేసే భర్త తన భార్యను కష్టపడి చదివించి ఎస్సైగా ఉద్యోగం వచ్చేలా సహకరించాడు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత భర్తతో కలిసి ఉండలేనని ఆమె కోర్టును ఆశ్రయించింది. భర్త ధోతీ–కుర్తా ధరించడం, పిలక ఉంచుకోవడం తన హోదాకు అవమానంగా ఉందని ఆమె వాదించింది. కోర్టు కౌన్సెలింగ్ ఇచ్చినా ఆమె నిర్ణయంలో మార్పు రాలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

ట్యాగ్స్ :