జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. పుల్ల సాయగౌడ్ తన భార్య పుష్పలత, కొడుకు వెంకటేశ్‌తో కలిసి పోటీ చేశారు. మొదట సాయగౌడ్ నామినేషన్ వేయగా, తర్వాత భార్య, కొడుకుతోనూ డమ్మీ నామినేషన్లు వేయించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా భార్య, కొడుకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడంతో ముగ్గురూ బరిలో నిలిచారు. దీంతో సాయగౌడ్ 85 ఓట్లతో విజయం సాధించారు.