
ఉప్పల్లో రాజస్థాన్-హైదరాబాద్ పోరు
ఉప్పల్ వేదికగా సోమవారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్.. తమ సొంత మైదానంలో ఆడిన తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసింది. మరోవైపు, వరుసగా 4 మ్యాచ్ల్లో గెలిచి అద్భుతమైన ఫామ్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి తమ జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ కీలక పోరులో సన్రైజర్స్ ఎలా రాణిస్తుందో చూడాలి.




































