హైదరాబాద్‌లో దీపావళి వేడుకలు.. 70 మందికి పైగా గాయాలు

TG: హైదరాబాద్‌లో దీపావళి వేడుకల సందర్భంగా 70 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది చిన్న పిల్లలు, యువకులు ఉన్నారని, వారి కళ్లకే గాయాలయ్యాయని ఐ హాస్పిటల్ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 90 మంది చికిత్స పొందగా, ఇద్దరికి సర్జరీ అవసరమైంది. టపాకాయల వల్ల కాలుష్యం కూడా పెరుగుతుందని, ఇది ఆరోగ్యానికి హానికరం అని నివేదికలు పేర్కొన్నాయి.