ఈ ఏడాది మెట్ గాలా వేదికపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సుధా రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన రాయల్ బ్లూ గౌనులో ఆమె మెరిశారు. మచిలీపట్నం కలంకారీ శైలిలో ‘ట్రీ ఆఫ్ లైఫ్’ థీమ్‌తో రూపొందించిన ఈ దుస్తులు కళాత్మకతకు ప్రతీకగా నిలిచాయి. ఆమె ధరించిన సుమారు రూ.140 కోట్ల విలువైన ఆభరణాలు ఈ వేడుకలో హైలెట్‌గా మారాయి. 550 క్యారెట్ల టాంజానైట్ రాయి కలిగిన నెక్లెస్, డైమండ్ రింగ్స్ ఆమె లుక్‌కు మరింత రాజసం తీసుకువచ్చాయి. హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం గర్వంగా ఉందని సుధా రెడ్డి తెలిపారు.